తెలంగాణ

telangana

ETV Bharat / state

పెరిగిన ఉల్లి ధర: రైతుల్లో ఆనందం.. వినియోగదారుల్లో విచారం - మహబూబ్​నగర్​ జిల్లాలో పెరిగిన ఉల్లి ధరలు

వర్షాల తాకిడితో కొంత ఉల్లి పంట నీట మునిగినా.. మిగిలిన పంటకు ధరలు పెరగడంతో రైతులకు ఊరట కలిగింది. కానీ వినియోగదారులకు మాత్రం పెరిగిన ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి ధర కనిష్ఠంగా రూ. 1200 కాగా గరిష్ఠంగా రూ. 3900 పలుకుతోంది.

onion rates hiked in devarakadra market mahaboob nagar district
పెరిగిన ఉల్లి ధర: రైతుల్లో ఆనందం.. వినియోగదారుల్లో విచారం

By

Published : Oct 7, 2020, 1:06 PM IST

వరుస వర్షాలకు చేతికొచ్చిన ఉల్లి పంట నీట మునిగి నేల పాలైనా.. మిగిలిన పంటకు మాత్రం పెరిగిన ధరలు కొంత ఊరటను కలిగిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో బుధవారం నిర్వహించిన వేలం పాటలో క్వింటాల్​ ఉల్లి ధర కనిష్ఠంగా రూ.1200, గరిష్ఠంగా రూ.3900 పలకడంతో ఉల్లి రైతుకు కొంత ఉపశమనం కలిగింది. పెరిగిన ఉల్లి ధరలతో రైతులకు కాస్త ఊరట లభించినా పేద, మధ్యతరగతి వినియోగదారులు మాత్రం ఉల్లి కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు.

కూరగాయలతో సమానంగా..

బయట మార్కెట్​లో కొత్త ఉల్లి కిలోకు రూ.30 ఉండగా, పాత ఉల్లి కిలోకు రూ.50 నుంచి రూ. 60 వరకు ఉంది. కూరగాయలతో సమానంగా ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రతి వారం ఉల్లి ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లి విరిసినా అనుకున్నంత దిగుబడి లేకపోవడంతో పెరిగిన ధరలకి అమ్ముకునేందుకు పంట లేదని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి:తెలంగాణలో మరో 2,154 కరోనా కేసులు, 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details