మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. పండించిన రైతులు సంబురపడ్డారు. గత వారం కొత్త ఉల్లికి మార్కెట్లో కనిష్టంగా రూ.1800 నుంచి రూ.2300 కొనసాగాయి. ఇవాళ జరిగిన క్రయవిక్రయాల్లో వ్యాపారులు, వినియోగదారులు వేలంపాటలో పోటీ పడి కొనుగోలు చేశారు. కనిష్టంగా రూ.2400 నుంచి రూ. 3000 వరకు కొనసాగాయి. కొత్త ఉల్లికి సైతం పాత ఉల్లితో సమానంగా ధరలు రావడం వల్ల ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లికి రెక్కలు.. రికార్డు స్థాయిలో ధరలు - undefined
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు మరోసారి పెరిగి పండించిన రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపాయి. క్వింటాల్ ఉల్లి కనిష్టంగా రూ.2400 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు కొనసాగింది.

ఉల్లికి రెక్కలు.. రికార్డు స్థాయిలో ధరలు
ఉల్లికి రెక్కలు.. రికార్డు స్థాయిలో ధరలు
Last Updated : Sep 18, 2019, 8:19 PM IST