మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో పాటు కర్నూలు, రాయచూర్, మలకపేట మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి ఉల్లి దిగుబడి ఎక్కువవటం వల్ల ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తడిసిన ఉల్లి ఎక్కువ రోజులు నిలువ ఉండట్లేదని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్థులు ఆసక్తి చూపించటం లేదు. దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ ఉల్లి కనిష్ఠంగా రూ.1500 నుంచి గరిష్ఠంగా రూ. 2450 వరకు ఉందని మార్కెట్ కార్యదర్శి భాస్కర్ తెలిపారు. గతంలో ఉన్న ఉల్లి ధరలతో పోలిస్తే క్వింటాల్‌కు 400 నుంచి 600 వరకు నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఉల్లితో పాటు పచ్చ జొన్నలు కూడా భారీగా దిగుబడి అయ్యాయి. పజ్జొన్నలు క్వింటాలుకు రూ. 3,600 నుంచి రూ. 4400 వరకు పలుకుతున్నాయి.
వరుస వర్షాలతో నేలచూపులు చూస్తోన్న ఉల్లి ధరలు - తగ్గుతున్న ఉల్లిధరలు
నిన్నటి వరకు మంట పుట్టించిన ఉల్లి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు ఉల్లి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. గత వారం వరకు క్వింటా ఉల్లి ధర గరిష్ఠంగా రూ.3160 పలుకగా... ఈ వారం గరిష్ఠంగా రూ. 2450కి పడిపోవటం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు.
ONION RATES FALL DOWN FOR CONTINUOUS RAINS IN TELANGANA STATE