ఉల్లి ధరలు మరోసారి పెరుగుతున్నాయి. కొత్త పంట స్థానిక మార్కెట్లకు రావడం వల్ల నెల రోజులుగా తగ్గిన ఉల్లి ధరలు.. డిమాండ్ మేరకు దిగుబడి లేక మరోసారి ఎగబాకుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లి కనిష్ఠ ధర రూ.3100, గరిష్ఠ ధర రూ 4,200 వరకు ఉంది.
మరోసారి ఉల్లి ధర పెరుగుతోంది..
ఉల్లి ధరలు మరోసారి పైకి ఎగబాకుతున్నాయి. జనవరి చివరి వారం వరకు బహిరంగ మార్కెట్లో రూ.30 నుంచి 40 మాత్రమే ఉన్న ధరలు.. అప్పటి నుంచి పెరుగుతూ రూ.50 నుంచి రూ.60కు చేరుకున్నాయి.
మరోసారి ఉల్లి ధరలు పెరుగుతున్నాయ్
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ప్రతి బుధవారం.. ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈ మార్కెట్ రేట్లు జిల్లాలో ఉల్లిధరలను ప్రభావితం చేస్తాయి. జనవరి చివరి వారం వరకు క్వింటా ఉల్లి ధర రూ.2,000 నుంచి గరిష్ఠంగా రూ.3,000 వరకు ఉంది. 15 రోజుల్లోనే రూ.4200కు చేరింది. దుకాణాల్లో కిలో ఉల్లి ధర రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది. జనవరి చివరి వారం వరకు బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40 మాత్రమే ఉండేది.