మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నవాబుపేట మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన నర్సింలు, ఆయన తల్లి లక్ష్మమ్మ ద్విచక్రవాహనంపై తమ గ్రామానికి వస్తుండగా... మాచారం సమీపంలో కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సింలు అక్కడికక్కడే మృతి చెందగా... తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు లక్ష్మమ్మని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కంటైనర్, ఒకరు మృతి - ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కంటైనర్
వేరే గ్రామానికి వెళ్లి... తన తల్లితో కలిసి ద్విచక్రం వాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. అంతలోనే కంటైనర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చి... తమ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబ్నగపర్ జిల్లా జడ్చర్ల సమీపంలో జరిగింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కంటైనర్, ఒకరు మృతి