మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల్ సమీపంలో గల ఎన్హెచ్-44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతే వేగంతో దూసుకెళ్లి క్రూజర్ వాహనాన్ని ఢీకొట్టింది. రెండు వాహనాల్లో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా... క్రూజర్ వాహన డ్రైవర్ శ్రీనివాసులు మృతి చెందారు. మరో నలుగురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
రెండు వాహనాలు ఢీ... ఒకరు మృతి - మహబూబ్నగర్లో రెండు వాహనాలు ఢీ... ఒకరు మృతి
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల్ సమీపంలో ఎన్హెచ్-44 జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
రెండు వాహనాలు ఢీ... ఒకరు మృతి