పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతోంది. వంటగ్యాస్ ధరలు మండుతున్నాయి. దీనికితోడు వంటనూనెల ధరలు సైతం గతంలో ఎన్నడూ లేనంతగా పెరగడం నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది.
సగటు ధరలు...
ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాల్లో వేరుశనగ నూనె ధర లీటరుకు రూ. 150 ఉంటే ప్రస్తుతం రూ. 160కి చేరింది. గత నెల రూ. 136 ఉన్న పొద్దుతిరుగుడు నూనె ప్రస్తుతం రూ. 147కు చేరింది. పామాయిల్ సైతం నెల రోజుల్లో రూ. 110 నుంచి రూ. 116కు పెరిగింది. ఇవే నూనెల ధరల్ని గత ఏడాదితో పోల్చితే పల్లి రూ. 35, పొద్దుతిరుగుడు రూ. 50, పామాయిల్ రూ. 35కు పెరిగింది.
జిల్లా వారీగా పెరిగిన రేట్లు వేరుగా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బహిరంగ మార్కెట్లో కిలో పల్లినూనె రూ. 158, పొద్దు తిరుగుడు రూ. 160, పామాయిల్ రూ. 124గా ఉంది. దీంతో సామాన్యుని నెలవారీ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి.
పెరిగిన ధరలతో నష్టాలు...
ఖర్చు పెరగడం వల్ల నెలకు 5 లీటర్లు వాడేవాళ్లు 3 లీటర్లతో సరిపెట్టుకుంటున్నారు. వ్యాపారులకు గిరాకీ తగ్గుతోంది. నూనె ఆధారిత ఆహార ఉత్పత్తులు తయారు చేసే చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కరోనా కారణంగా టిఫిన్లు, రెస్టారెంట్లు, హోటళ్లకు కాస్త గిరాకీ తగ్గింది. మరోవైపు ధరలు పెరిగాయి. వ్యాపారంలో లాభాలు లేవని వాపోతున్నారు.
వాటి ధరలు కూడా అధికమే...