తెలంగాణ

telangana

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్​ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రోగ్రామింగ్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్ వెంకట్రావు​ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

By

Published : Aug 28, 2020, 11:58 AM IST

Published : Aug 28, 2020, 11:58 AM IST

Officers should be vigilant: Collector Venkatrao Offic
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్​ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి వెంకట్రావు పేర్కొన్నారు. హోం క్వారంటైన్​లో ఉన్న వారిని గుర్తించి.. ఫోన్ ద్వారా వారితో మాట్లాడి ధైర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గురువారం మెడికల్ ప్రోగ్రామింగ్ అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

పాజిటివ్ వచ్చిన బాధితుల వద్దకు వెళ్లి.. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. హోం ఐసోలేషన్​లో ఉండే ప్రతి ఒక్కరి దగ్గరికి డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు వెళ్లి పరిశీలించి.. రోగి పరిస్థితికి సంబంధించిన నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా చూడాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండి పని చేయాలని సూచించారు. ఉద్యోగులు తమ విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్​ వెంకట్రావు

ఇదీచూడండి.. పరీక్షల వాయిదాకు నేడు​ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

ABOUT THE AUTHOR

...view details