తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

వ్యవసాయ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు లక్షల రూపాయల విలువ చేసే నాసిరకం పత్తి విత్తనాలను అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరులో అధికారులు దాడులు చేసి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

Officers Seize Fake Seeds In Mahabub Nagar
నకిలీ పత్తి విత్తనాల పట్టివెత

By

Published : Jun 6, 2020, 1:13 PM IST

మహబూబ్​ నగర్​ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు గ్రామ వ్యవసాయ బావి వద్ద వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. ఖరీఫ్​ సీజన్​ ఆరంభం కావడం వల్ల వ్యవసాయ శాఖ అధికారులు నాసిరకం విత్తనాలు, అనుమతి లేని విత్తనాలపై విస్తృతంగా తనిఖీలు చేశారు.

ఏలూరు సమీపంలోని రెడ్యా తండా వద్ద వెంగల్​ అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద గదిలో దాచిన రూ. 2 లక్షల విలువ చేసే నాసిరకం పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 279 నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని సీజ్​ చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్న వెంగల్​ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?

ABOUT THE AUTHOR

...view details