మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలో కుంటను కబ్జా ప్రయత్నాలపై ఈనాడు-ఈటీవీ భారత్లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. తహసీల్దార్ లక్ష్మినారాయణ, చిన్ననీటి పారుదలశాఖ డీఈ రమేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని బూరెడ్డిపల్లి శివారులో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకొని మూడెకరాల విస్తీర్ణంలో మురుగోని కుంట ఉంది. అది కోట్ల రూపాయల విలువ చేస్తోంది.
ఎఫెక్ట్: కుంట కబ్జాకు రియల్టర్ల యత్నం.. అధికారుల చర్యలు - ఈనాడు-ఈటీవీ భారత్తో కథనాలతో కుంటను కాపాడిన అధికారులు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి బూరెడ్డిపల్లి శివారులోని మురుగోని కుంట ఆక్రమించేందుకు... స్థిరాస్తి వ్యాపారులు యత్నించారు. ఈనాడు-ఈటీవీ భారత్లో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు... కుంటకు సరిహద్దులు ఏర్పాటు చేశారు.
కుంట పక్కనే వెంచర్ వేసిన స్థిరాస్తి వ్యాపారులు... కుంట సరిహద్దులు తొలగించి, ఆక్రమించినట్టుగా గుర్తించారు. కుంట మూడెకరాల విస్తీర్ణంతోపాటు ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్కు పది అడుగుల దూరంలో తిరిగి సరిహద్దులు ఏర్పాటు చేశారు. కుంట పరిధిలో వేసిన మట్టిని తొలగించి... కట్ట, తూము, కాల్వలు ఏర్పాటు చేయాలని వెంచర్ నిర్వాహకులను ఆదేశించారు. అధికారులకు తెలియకుండా కుంటలో ఎలాంటి పనులు చేపట్టినా, అక్రమించే ప్రయత్నం చేసినా... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి:స్లాట్ బుకింగ్ లేకుండానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు