రాష్ట్రంలో వర్షాలు జోరందుకుంటున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు విత్తన కంపెనీలు, దుకాణాలలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల మండల కేంద్రాల్లోని విత్తన దుకాణాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
'నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు' - భూత్పూర్, జడ్చర్ల మండల కేంద్రాల్లోని విత్తన దుకాణాల్లో తనిఖీలు వార్తలు
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల మండల కేంద్రాల్లోని విత్తన దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు
అమ్మకానికి సిద్ధంగా ఉన్న పత్తి విత్తనాలను పరిశీలించి.. వాటికి బీటీ 3 పరీక్షలు నిర్వహించారు. నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు.
ఇదీ చూడండి...కరోనా పాజిటివ్ వచ్చినా.. కారు జోరు ఆగదు