ఒడిశా నుంచి నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికులను వారి అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి శనివారం శ్రామిక్ రైలు బయలు దేరింది. నారాయణపేట జిల్లా నుంచి సుమారు 1600 మంది, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వంద మంది సహా వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన కొంతమందిని ఈ రైళ్లో ఒడిశాకు పంపనున్నారు.
మహబూబ్నగర్ నుంచి ఒడిశా కూలీల తరలింపు - ఒడిశా కూలీల తాజా వార్తలు
రాష్ట్రానికి ఉపాధి నిమిత్తం వచ్చిన ఒడిశా కార్మికులను వారి స్వస్థలాలకు అధికారులు చేరవేస్తున్నారు. ఇందులో భాగంగా.. మహబూబ్నగర్, నారాయణపేట, వసపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి శ్రామిక్ రైళు ద్వారా తరలిస్తున్నారు. ఈ కూలీలందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి.. మాస్కులు ఇచ్చి పంపుతున్నారు.
మహబూబ్నగర్ నుంచి ఒడిశా కూలీల తరలింపు
ఈ రైళు నేరుగా ఒడిశాలోని నవపాడ్ జిల్లాకు చేరుకోనుంది. ఒడిశాకు వెళ్లే కార్మికులందరికీ వైద్యారోగ్యశాఖ అధ్వర్యంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి.. మాస్కులతో పంపుతున్నారు. అవసరమైన వారికి జ్వరం, నొప్పులు ఇతర సాధారణ జబ్బులకు సంబంధించిన మందులు, మంచినీరు, ఆహారం సైతం ఇచ్చారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన, మహబూబ్ నగర్ ఏఎస్పీ సహా రెవెన్యూ, పోలీసు అధికారులు.. దగ్గరుండి వారిని రైళు ఎక్కించారు.
ఇదీ చూడండి :'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం