మనుషులే కాదు.. ప్రకృతిలో చిన్న ప్రాణి కూడా రక్షణ కోసం తనదైన వ్యూహాలను అమలు చేస్తుంది. శత్రువులకు కనిపించకుండా కొండ వెనక నక్కినట్లుగా ఈ పావురాలు.. బండరాయిపై ఏటవాలుగా ఉన్న వైపు ఒదిగి కూర్చున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పెద్దచెరువు సమీపంలో ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.
గూళ్లు లేని చోట పావురాలు ఎందుకలా కూర్చున్నాయి? - తెలంగాణ వార్తలు
ఏ ఆహారం లభించని చోట, గూళ్లు లేని చోట పావురాలు గుమిగూడాయి. ముచ్చటిస్తున్నాయి. ఏదో రహస్య సమాచారం కోసం వేచి చూస్తున్నట్లు నక్కి ఉన్నాయి. ఇంతకీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయో తెలుసా?
గూళ్లు లేని చోట పావురాలు ఎందుకలా కూర్చున్నాయి?
ఏ ఆహారం లభించని చోట, గూళ్లు లేని చోట అవి ఎందుకిలా కూర్చున్నాయని సందేహం వచ్చిందా? ఈ విషయంపై జీవశాస్త్ర సహాయ ఆచార్యులు బక్షి రవీందర్‌రావుని సంప్రదించగా.. శత్రువులు దాడి చేస్తాయని భావించినప్పుడు పావురాలు ఇలా నక్కి తమను తాము కాపాడుకొంటాయని తెలిపారు. సాధారణంగా పావురాలపై గద్దలు, డేగలు దాడులు చేస్తుంటాయని, వాటి నుంచి రక్షణకు ఇలా దాక్కుంటాయని వెల్లడించారు.