మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లోని మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మక్తల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన పీవీ సింధును ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో మక్తల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గవినోళ్ల గోపాల్‌రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ నర్సింహాగౌడ్, జడ్పీటీసీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
మక్తల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు - మక్తల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మినీ స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి ప్రారంభించారు.

మక్తల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
మక్తల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
ఇదీ చదవండిః కేటీఆర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర ట్వీట్