కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లా తొలి కలెక్టర్‌గా ఎస్.వెంకట్రావు బాధ్యతలు స్వీకరించారు. నూతన జిల్లాని ప్రథమ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
నారాయణపేట తొలి కలెక్టర్
By
Published : Mar 1, 2019, 1:06 PM IST
నారాయణపేట తొలి కలెక్టర్
నారాయణపేట జిల్లా తొలి కలెక్టర్‌గా ఎస్. వెంకట్రావు బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం 10:15 నిమిషాలకు ఛార్జ్ తీసుకున్నారు. వీఆర్వో వెంకటేశ్వర్లు కలెక్టర్‌కి ఘనస్వాగతం పలికారు. వెంకట్రావు గతంలో మహబూబ్‌నగర్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. పదోన్నతిపై నారాయణపేట జిల్లా ప్రథమ పౌరుడిగా బాధ్యతలు చేపట్టారు. నూతన జిల్లాని ప్రథమ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.