తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరులో నామినేషన్ల స్వీకరణ.. 49 వార్డులకు 17 కౌంటర్లు - మహబూబ్​నగర్​ జిల్లా వార్తలు

మహబూబ్​నగర్​ పురపాలక కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామపత్రాలు దాఖలు చేసేందుకు 17 కౌంటర్లు పెట్టారు.

పాలమూరులో నామినేషన్ల స్వీకరణ.. 49 వార్డులకు 17 కౌంటర్లు
పాలమూరులో నామినేషన్ల స్వీకరణ.. 49 వార్డులకు 17 కౌంటర్లు

By

Published : Jan 8, 2020, 3:31 PM IST

పాలమూరులో నామినేషన్ల స్వీకరణ.. 49 వార్డులకు 17 కౌంటర్లు
పురపాలిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్​ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అభ్యర్థులు ప్రాపర్టీ టాక్స్ కట్టేందుకు, నూతన ధ్రువపత్రాలు అందించేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్థానిక పురపాలక పరిధిలో 49 వార్డులు ఉండగా.. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు 17 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. ఒక్క కౌంటర్​లో మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details