జగన్ చేసిన జలదోపిడీకి కేసీఆర్ అండగా వ్యవహరిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 203 జీవోకు వ్యతిరేకంగా కాంగ్రెస్ జలాశయాల వద్ద నిరసన చేపడుతుంటే... ఎందుకు వారిని అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. ఆంధ్రపాలకులకు మద్దతుగా ఎందుకు నిలుస్తున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
203 జీవో అడ్డుకోకుంటే... ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఎడారులుగా మారుతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైహోం రామేశ్వర్‌రెడ్డి, మెగా కృష్ణారెడ్డిలకు లాభం చేకూర్చేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 203 జీవో అడ్డుకునేందుకు ఎంతవరకైనా... పోరాడతామని తెలిపారు.
జగన్ జలదోపిడీకి కేసీఆర్ అండగా నిలిచాడు: రేవంత్‌రెడ్డి ఇదీ చదవండి:ఆగని కరోనా.. మరో 94 కేసులు నమోదు