రాష్ట్రంలో కరెంటు సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి బెంగళూరులో ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే దాన్ని సొమ్ము చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తారని దుయ్యబట్టారు. విద్యుత్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని గతంలో పదేపదే ఆరోపించిన భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్... ఇప్పుడు ఎందుకు నోరుమెదపటం లేదని ప్రశ్నించారు.
'విద్యుత్ ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలి' - కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు
రాష్ట్రంలో సాగుతున్న విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఇచ్చిన లోన్లలో జరిగిన కుంభకోణాలపై కేంద్రానికి లేఖలు రాయనున్నట్లు రేవంత్ తెలిపారు.
MP REVANTH REDDY ALLEGATIONS ON POWER PROJECTS IN TELANGANA
విద్యుత్ ప్రాజెక్టుల్లో జరిగుతున్న అవినీతి పట్ల కేంద్రం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన లోన్లలో జరిగిన కుంభకోణాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లిఖితపూర్వకంగా వివరించనున్నట్లు రేవంత్ తెలిపారు.