మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రం నుంచి ఈద్గానిపల్లితో పాటు ఇతర గ్రామాలకు వెళ్లే మార్గంలో ఇటీవలే రైల్వే అంతర్గత వంతెన నిర్మించారు. ఇవాళ కురిసిన మోస్తరు వర్షానికి వంతెన వద్ద వర్షపు నీరు వచ్చి చేరింది. అది తెలియక అటుగా వెెళ్లే ప్రయత్నం చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయాయి. బయటకు తీసేందుకు ప్రయాణికులు తంటాలు పడ్డారు.
మోస్తరు వర్షానికే ఇలా ఉంటే... ఇంకా భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాజాపూర్ రైల్వే అంతర్గత వంతెన వద్ద నిలిచిపోయిన రాకపోకలు - రాజాపూర్లోని రైల్వే అంతర్గత వంతెన వద్ద వాహనదారుల ఇక్కట్లు
ఓ మోస్తరు వర్షానికే ఇటీవల రాజాపూర్ మండల కేంద్రం సమీపంలోని నిర్మించిన రైల్వే అంతర్గత వంతెన వద్ద నీరు చేరడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్లిన వాహనాలు నీట మునిగిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

v
Last Updated : Jul 16, 2020, 11:53 AM IST
TAGGED:
varsham tyo vantena band