మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్‌తో కలిసి పరిశీలించారు. కరోనా బాధితులకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా బాధితులకు కల్పిస్తున్న వైద్య సౌకర్యాలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన సేవలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటన, చిన్నచింతకుంట పీహెచ్సీ
అదే మండలంలోని లాల్ కోట గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. అనంతరం దేవరకద్ర పట్టణంలో కొనసాగుతున్న లాక్డౌన్ తీరును పరిశీలించి... ఎస్సై భగవంతు రెడ్డితో మాట్లాడారు. కరోనా నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి:'దేశంలో 80% పల్లెలు వైద్యానికి దూరం'