మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. బస్టాండ్‌లో పెట్రోల్ బంకు, వ్యాపార సముదాయాలను, కల్యాణ మండపం, సినిమా థియేటర్‌తో పాటు... అవసరమైన చోట సీసీ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
దేవరకద్రలో ఎమ్మెల్యే పర్యటన... అభివృద్ధి పనులపై ఆరా - ఎమ్మెల్యే వెంకటశ్వర రెడ్డి
దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించి... పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పట్టణానికి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సులభ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
దేవరకద్రలో ఎమ్మెల్యే పర్యటన... అభివృద్ధి పనులపై ఆరా
పట్టణానికి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సులభ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసులకు సూచించారు. అనంతరం రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి సమీక్షించారు. పనులను మరింత వేగవంతం చేస్తూనే సర్వీస్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణం పనులను పరిశీలించారు.
ఇదీ చూడండి:బృహన్ ముంబయిలో చిల్లర జీతాలు