నియోజకవర్గంలో లాక్‌డౌన్ అమలు పరిస్థితిని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, కొత్తకోట, భూత్పూర్ మండల కేంద్రాల్లో ఆయన పర్యటించారు. లాక్‌డౌన్‌కు పూర్తి మద్దతుగా ప్రజలు బయటకు రాకపోవడం అభినందనీయమన్నారు.
'లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలి' - తెలంగాణ తాజా వార్తలు
కొవిడ్ కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించి కొవిడ్‌ను అరికట్టాలని సూచించారు.
Telangana news
అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించాలని, శానిటైజర్ వెంటే ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. కొవిడ్ బాధితులెవరు ఆధైర్యపడొద్దని... మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.