గత నెల 29న రాత్రి మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ ఢీకొని రైతు నర్సింహులు మృతి చెందిన సంఘటన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కాగా బాధిత కుటుంబాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరామర్శించారు. నర్సింహులు మృతి పట్ల భాజపా నాయకులు మాజీ మంత్రి డీకే అరుణ, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్.. తెరాస ప్రభుత్వంపై, పార్టీ కార్యకర్తలపై చేసిన విమర్శలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు.
నర్సింహులు మృతిపట్ల ప్రతిపక్షాల విమర్శలను ఖండించిన ఎమ్మెల్యే - ఇసుక లారీప్రమాదంలో మృతి పట్ల ప్రతిపక్షాల విమర్శలపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పందన
ఇసుక లారీ ఢీ కొని మృతి చెందిన రైతు నర్సింహులు మృతి పట్ల మాజీ మంత్రి భాజపా నాయకురాలు డీకే అరుణ, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ఆరోపణలను జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. మహబూబ్ నగర్ జిల్లా తిరుమలాపూర్ గ్రామంలోని మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.
గతంలో అధికారంలో ఉన్నా ఇప్పటికీ భాజపా నాయకుల హయాంలోనే జడ్చర్ల నియోజకవర్గంలో ఇసుక అక్రమ దందా జరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అనవసర ఆరోపణలు మానుకోవాలని.. అక్రమ వ్యాపారాలును తెరాస ప్రభుత్వం సహించబోదని వెల్లడించారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతు మృతికి కారణమైన నిందితులపై చట్టపరంగా చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే వివరించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:ఆ రాష్ట్ర గవర్నర్‌కు కరోనా పాజిటివ్