మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం కోసం మినీ కొవిడ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. కరోనా బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. 50 మంది బాధితులకు ఆశ్రయం కల్పించేలా సదుపాయాలు ఉన్నాయని అన్నారు.
'దేవరకద్ర మినీ కొవిడ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే' - కొవిడ్ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
దేవరకద్రలో ఏర్పాటు చేసిన మినీ కొవిడ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అన్ని సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
మిన కొవిడ్ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర కొవిడ్ సెంటర్
నిత్యం వైద్యుల పర్యవేక్షణ ఉంటుందని... కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శశికాంత్ తెలిపారు. కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శంకరాచారి, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, స్థానిక వైద్యాధికారి డాక్టర్ షబానా బేగం, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కరోనా యోధులు.. ఈ సారథులు