మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకటగిరి గ్రామంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పర్యటించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నేలకూలిన ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడారు. వారికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.
నేలకూలిన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి - rain effect in venkatagiri
వరుసగా కురుస్తున్న వర్షాలకు నేలకూలిన నివాస గృహాలను మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.
mla-ala-venkateshwar-reddy-visited-venkatagiri
కౌకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి బాధితులకు ఏ విధమైన సాయం చేయాలో ఆ స్థాయిలో తప్పకుండా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.