చెక్ డ్యాంల నిర్మాణాల వలన .. భూగర్భ జలాల పెరిగి రైతులకు మేలు జరగనుందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చెక్‌డ్యాం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేవరకద్ర మండలంలోని పేరూరు గ్రామంలో పెద్ద వాగుపై రూ. 4.995 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణం చేయుటకు స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి భూమి పూజ చేశారు.
రాజకీయాలను పక్కన పెట్టి..
కలెక్టర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చెక్ డ్యాం నిర్మాణం త్వరగా జరిగే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం రామన్‌లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు రాజకీయాలను పక్కన పెట్టి అర్హులైన నిరుపేదలకు రెండు పడకల ఇల్లు పొందేలా.. నిర్మాణం పనులను ప్రారంభించాలని సూచించారు. అనుబంధ గ్రామమైన కిష్టంపల్లి గ్రామంలో పర్యటించి గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న పసివాడు