తెలంగాణ

telangana

By

Published : Sep 8, 2020, 7:10 PM IST

ETV Bharat / state

చిన్నచింతకుంట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆల

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

చిన్నచింతకుంట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆల
చిన్నచింతకుంట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆల

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని బండర్ పల్లి గ్రామంలోని పెద్ద చెరువులో 54 వేల చేప పిల్లలను వదిలి గ్రామంలోని సహకార సంఘం సభ్యులకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అనంతరం మత్స్య సహకార సంఘం సభ్యులకు ప్రభుత్వము మంజూరు చేసిన రూ.10 లక్షలతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు.

జిల్లాలో ఇప్పటివరకు నాలుగు వందల చెరువులలో కోటి చేపపిల్లలను పెంపకం కోసం వదిలినట్లు జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు రాధా రోహిణి తెలిపారు.

అనంతరం చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఛైర్ పర్సన్ తో కలిసి ఎమ్మెల్యే ఆల.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, రాము, సర్పంచ్ సతీశ్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details