చాలా సేపు మంచినీరు వృథాగా పోయి... చుట్టపక్కన పంటపొలాలు, రోడ్డుపైన వరదలా పారింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు నీటి వృథాను అరికట్టారు.పైప్ లైన్ లీకేజీకి కారణం నిర్వాహకుల పర్యవేక్షణ లోపమేనని గ్రామస్థులు ఆరోపించారు.
పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా - PI[PE LEAKEGE
అసలే ఎండాకాలం. తాగేందుకే నీరు దొరకని ఈ సమయంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పైప్ లైను పగిలి తాగు నీరు వృథాగా పోయింది. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్కోట చౌరస్తాలో జరిగింది.
పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా
ఇవీ చదవండి:దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె : కేటీఆర్