తెలంగాణ

telangana

ETV Bharat / state

జనతా కర్ఫ్యూ: కుటుంబ సభ్యులతో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ వార్తలు

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తన నివాసంలో కుటుంబ సభ్యులతో గడిపారు. ప్రధాని మోదీ పిలుపు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.

జనతా కర్ఫ్యూ: కుటుంబ సభ్యులతో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
జనతా కర్ఫ్యూ: కుటుంబ సభ్యులతో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Mar 22, 2020, 6:34 PM IST

జనతా కర్ఫ్యూ: కుటుంబ సభ్యులతో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్​నగర్​లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో గడిపారు. 24 గంటల జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేసీఆర్.. చొరవ చూపించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details