వచ్చే ఏడాది వానాకాలం నాటికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉదండపూర్ జలాశయం వరకు ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సహా నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాలమూరు- రంగారెడ్డి పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కొవిడ్, భూసేకరణ, కోర్టు కేసులు ఇతర సాంకేతిక కారణాల వల్ల పనులు వెనకపడ్డాయని.. ఇక నుంచి పనులు వేగవంతమవుతాయని మంత్రులు వెల్లడించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సద్వినియోగం చేసుకునే దిశగా.. పాలమూరు- రంగారెడ్డి పథకంలో భాగంగా 20 టీఎంసీల సామర్థ్యం గలిగిన ఆన్లైన్ రిజర్వాయర్లను సైతం దశల వారీగా చేపట్టనున్నట్లు చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిపై మంత్రులు, నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
వచ్చే వానాకాలం నాటికి పాలమూరుకు నీళ్లు అందించడమే లక్ష్యం - నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్
వచ్చే వానాకాలం నాటికి పాలమూరు జిల్లాకు నీళ్లు అందించడమే లక్ష్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేపడుతున్నామని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు తెలిపారు. కొవిడ్ , భూ సేకరణ, కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాల వల్లే పనులు వెనుకపడ్డాయని... ఇక నుంచి వేగవంతమవుతాయన్నారు.

వచ్చే వానాకాలం నాటికి పాలమూరుకు నీళ్లు అందించడమే లక్ష్యం
వచ్చే వానాకాలం నాటికి పాలమూరుకు నీళ్లు అందించడమే లక్ష్యం