తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికలు ఏవైనా విజయం తెరాసదే' - ఎన్నికలు ఏవైనా విజయం తెరాసదే

సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సహకార శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాలు, ఫుడ్ ప్రాసెసింగ్ సహా అనేక అంశాల్లో సహకార సంఘాల పాత్రను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

ministers on dccb Elections in Mahabubnagar
'ఎన్నికలు ఏవైనా విజయం తెరాసదే'

By

Published : Feb 29, 2020, 7:35 PM IST

మహబూబ్ నగర్ డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు మంత్రులు నిరంజన్​ రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 9 డీసీసీబీలు, 150కి పైగా పీఏసీఎస్​లు తెరాస బలపరిచిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చరిత్రగా అభివర్ణించారు. కేసీఆర్ సర్కారు రైతు పక్షపాత సర్కారని చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యమని వెల్లడించారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా విజయం తెరాసేదేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. సహకార సంఘాల ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకూ సముచిత స్థానం కల్పించారన్నారు. పని చేసే వారికి మంచి అవకాశాలుంటాయని ఈ ఎన్నికలు నిరూపించాయని అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఎన్నికలు ఏవైనా విజయం తెరాసదే'

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details