ఆరేళ్లలోనే మహబూబ్‌నగర్ జిల్లా చాలా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పాలమూరు ప్రభుత్వ వైద్యశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఈటలతో కలిసి ఆయన పాల్గొన్నారు. గతంలో ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేవారని... ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పెద్ద ఆస్పత్రి నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.
పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన కేటీఆర్ - తెలంగాణ తాజా వార్తలు
మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
![పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన కేటీఆర్ Government Medical College at mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8004577-thumbnail-3x2-haspi-rk.jpg)
పాలమూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రులు
ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరు చేశారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దాదాపు 200 మంది వైద్య సిబ్బందితో ప్రజలకు వైద్య సేవలు అందుతాయని వెల్లడించారు.