వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించారు. ఇటీవలే శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి స్వగృహానికి చేరుకొని నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన ఈటల, మల్లారెడ్డి - మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్తలు
పితృవియోగంతో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి పరామర్శించారు. పలువురు ఎమ్మెల్యేలూ ఆయన నివాసానికి చేరుకున్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పరామర్శ
ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, అందే బాబయ్య, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు సహా పలువురు రాష్ట్ర స్థాయి నేతలు శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.
ఇదీ చదవండి:హస్తం వీడిన కూన శ్రీశైలం గౌడ్ .. త్వరలో కమలం గూటికి