మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని.. పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో ఆదివారం మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తలసాని.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి వెళ్లారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్తలు
పితృవియోగంతో బాధపడుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. మహబూబ్‌నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్
నారాయణ గౌడ్ చిత్రపటానికి తలసాని పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
ఇదీ చదవండి:21 జిల్లాల్లో ఆయుధ లైసెన్సులు రద్దు