తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబ్‌నగర్‌ను క్రీడల హబ్​గా తీర్చిదిద్దుతాం: శ్రీనివాస్ గౌడ్

పారా మోటార్ ఛాంపియన్​షిప్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా దేశ వ్యాప్తంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు మంచి గుర్తింపు లభించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. త్వరలో 15 ఎకరాల్లో జాతీయ పారా మోటార్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపడతామని అయన తెలిపారు. మహబూబ్‌నగర్‌ను క్రీడల హబ్​గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

Minister Srinivas Gowda at National Para Motor Championship Program ne
మహబూబ్‌నగర్‌ను క్రీడల హబ్​గా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : Jan 17, 2021, 6:11 PM IST

మహబూబ్‌నగర్‌ను క్రీడల హబ్​గా తీర్చిదిద్దుతామని క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన జాతీయ పారా మోటార్ ఛాంపియన్ షిప్ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

"భారత దేశంలో ఎక్కడా నిర్వహించని విధంగా జాతీయ పారా మోటార్ ఛాంపియన్ షిప్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా దేశ వ్యాప్తంగా మహబూబ్‌నగర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. మహబూబ్ నగర్‌లో అన్ని రకాల క్రీడలను అభివృద్ధి చేసి క్రీడలకు హబ్​గా జిల్లాని తీర్చిదిద్దుతాం. ఇప్పటికే జిల్లా కేంద్రంలో వాలీబాల్ అకాడమీ, మహిళ క్రీడాకారులకు హాస్టల్ భవన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం"

-- శ్రీనివాస్‌గౌడ్‌, క్రీడలు, పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి.

ఇండోర్, అవుట్‌డోర్‌ స్టేడియంలతో పాటు క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే 15 ఎకరాల్లో జాతీయ పారా మోటార్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ఐదు రోజులపాటు నిర్వహించిన జాతీయ పోటీలలో హర్యానాకు చెందిన నితిన్ కుమార్ ఓవర్ అల్ ఛాంపియన్​గా నిలవగా, సత్యనారాయణ సోలో ఛాంపియన్‌గా, స్పాట్ లాండింగ్ ట్రైక్ విభాగంలో ఇమాదుద్దీన్ ఫారూకిలు ఛాంపియన్‌లుగా నిలిచారు. గెలిచిన వారికి మంత్రి బహుమతులను, జ్ఞాపికలను అందజేశారు.

ఇదీ చూడండి: ఆర్మీలో చేరే అర్హత లేదని యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details