ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా తెరాస సర్కారు కృషి చేస్తోందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్ పార్క్, వెయ్యి ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు, ఐటీ పార్క్ లాంటివి త్వరలోనే జిల్లాలో అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లాలోని కరోనా బాధితుల కోసం ప్రభుత్వాసుత్రిలో 220 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. 67 వెంటిలేటర్లు, 27 చోట్ల టెస్టింగ్ సెంటర్లు, 220 పడకలకు ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కర్వెన, ఉదండపూర్ జలాశయ నిర్మాణ పనులను వేగిరం చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ పథకాల ద్వారా జిల్లా ప్రజలకు చేకూరిన లబ్ధిని మంత్రి వివరించారు. ప్రభుత్వ పథకాల సక్రమ అమలు కోసం నిర్విరామంగా శ్రమిస్తున్న అధికార యంత్రాంగం, సిబ్బందిని ఆయన అభినందించారు.
మహబూబ్‌నగర్‌లో జెండా ఎగురవేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇదీచూడండి: ప్రగతిభవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్