తెలంగాణ

telangana

ETV Bharat / state

మౌలిక సదుపాయల నిధులకు కృషి చేస్తున్నాం: శ్రీనివాస్‌ గౌడ్‌ - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తాజా వార్తలు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

మౌలిక సదుపాయల నిధులకు కృషి చేస్తున్నాం: శ్రీనివాస్‌ గౌడ్‌
మౌలిక సదుపాయల నిధులకు కృషి చేస్తున్నాం: శ్రీనివాస్‌ గౌడ్‌

By

Published : Sep 17, 2020, 10:06 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంతో పాటు హన్వాడ మండలంలో పర్యటించిన మంత్రి.. పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 148 మంది లబ్ధిదారులకు, హన్వాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను అందజేశారు. తల్లిదండ్రులకు ఆడపిల్లలు బారం కాకూడదనే ప్రభుత్వం ఆ పథకాలు తీసుకొచ్చిందన్నారు. ఆడపిల్లలు పుడితే వారికి విషం ఇచ్చిన ఘటనలు కలిచివేస్తున్నాయన్నారు.

ఇదీ చదవండి:అభివృద్ది పనులను పరిశీలించిన శ్రీనివాస్​గౌడ్

ABOUT THE AUTHOR

...view details