తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనాపై పుకార్లు పుట్టిస్తే కేసులే' - మంత్రి శ్రీనివాస్​ గౌడ్

మహబూబ్​నగర్​ జనరల్​ ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పరిశీలించారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

minister srinivas goud visited special isolation ward set up for corona patients in mahabub nagar general hospital
'కరోనాపై పుకార్లు పుట్టిస్తే కేసులే'

By

Published : Mar 5, 2020, 3:24 PM IST

కరోనాపై ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహబూబ్​నగర్​​ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డును పరిశీలించారు.

కరోనా పరిస్థితిని ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి సహా పలువురు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. కరోనాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు కాకుండా వదంతులు వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

'కరోనాపై పుకార్లు పుట్టిస్తే కేసులే'

ఇవీ చూడండి:కరోనాపై ప్రముఖుల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details