అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు పట్టణంలో ఐదు రూపాయల వ్యయంతోనే అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. అందుకోసం గ్యాస్ ఆధారిత శ్మశానవాటికను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరించారు.
రాష్ట్రంలోనే కొవిడ్ వ్యాక్సిన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. దీనిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం బాధాకరమన్నారు. జిల్లాలో కరోనాకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, అవసరమైతే వైద్యులు ఇంటి వద్దకే వచ్చి చికిత్స అందిస్తున్నారని వివరిచారు. ఎవరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో బిక్షాటన చేసుకునేవారికి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.