మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడం కోసమే పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణంలోని న్యూటౌన్ ప్రాంతంలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను మంత్రి ప్రారంభించారు. రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలు కోల్పోతున్న బాధితులు మంత్రికి తమ బాధ చెప్పుకోగా.. వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నష్టపరిహారం ఇప్పించేందుకు మంత్రి హామీ ఇచ్చారు. వారికి టీడీఆర్ బాండ్లు అందించారు.
'మహబూబ్‌నగర్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం' - మహబూబ్ నగర్ పట్టణం
మహబూబ్ నగర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడమే ధ్యేయంగా పలు అభివృద్ది పనులు చేపడుతున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణంలోని న్యూ టౌన్ ప్రాంతంలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను ఆయన ప్రారంభించారు.
!['మహబూబ్‌నగర్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం' Minister Srinivas Goud Starts Road Works In Mahabub Nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7474783-461-7474783-1591269879405.jpg)
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి
మహబూబ్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులు మొదలైనట్టు జంక్షన్ల వద్ద పూర్తిగా పట్టణీకరణ చేసి.. మహబూబ్ నగర్ పట్టణానికి కొత్త రూపు తెస్తామని మంత్రి తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసి.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీచూడండి :40 మంది విద్యార్థులపై కత్తితో దాడి