మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్‌లో మెడికల్ హబ్‌గా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రస్తుత కలెక్టరేట్ స్థలంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించే విధంగా అత్యాధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముందుగా చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించాలని అనుకున్నా.. జిల్లా అవసరాలను బట్టి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం ముఖ్యమంత్రిని కోరడంతో వెంటనే మంజూరు చేశారని మంత్రి తెలిపారు.
కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాలు సమీకృత భవనమైన నూతన కలెక్టరేట్ కార్యాలయంలోకి మారానున్నయని పేర్కొన్నారు. ఆ వెంటనే ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. అందులో భాగంగా పాత కలెక్టరేట్ భవనానికి సంబంధించిన పత్రాలను జిల్లా వైద్య శాఖ అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. మరో రెండు, మూడు రోజుల్లో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన నక్షలను తయారుచేస్తారని వెల్లడించారు. అంతకుముందు మంత్రి కలెక్టరేట్ ప్రాంతాన్ని పరిశీలించారు.