మహబూబ్ నగర్ జిల్లాలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోందని, వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి.. కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సను, తదితర వివరాలను ఆసుపత్రి వర్గాల ద్వారా అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించారు. లాక్ డౌన్లో వ్యాపారులు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలను పెంచి అమ్మవద్దని కోరారు. మానవతా దృక్పథంతో సహకారం అందించాలన్నారు.
'వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలి' - telangana varthalu
వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మహబూబ్ నగర్ జిల్లాలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోందని మంత్రి వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి.. కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సను, తదితర వివరాలను ఆసుపత్రి వర్గాల ద్వారా అడిగి తెలుసుకున్నారు.
కరోనా నియంత్రణలో భాగంగా ఇటీవలే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 160 మంది నర్సులు, 30మంది వార్డు బాయ్‌లు, 6మంది టెక్నీషియన్లు, 12మంది డాక్టర్లను నియమించామని చెప్పారు. సంచార వాహనాల ద్వారా ఇంటి దగ్గరే చికిత్స అందిస్తున్నామని గుర్తు చేశారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా కిట్లు ఇస్తున్నామని, వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే చికిత్స చేయించుకోవాలని కోరారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 500ఆక్సిజన్ బెడ్లు, సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కరోనా నియంత్రణలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ రాం కిషన్, డాక్టర్ జీవన్ ఉన్నారు.
ఇదీ చదవండి: నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత