మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి వాగులో సరదాగా గడిపారు. ప్రాజెక్టులు పరవళ్లు తొక్కడం వల్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల చరిత్రలో ఇంతటి నీటి ప్రవాహం ఎప్పుడు చూడలేదని అన్నారు.
వాగులో సరదాగా గడిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - వాగులో సరదాగా గడిపిన మంత్రి
మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి వాగులో సరదాగా గడిపారు. పారుతున్న నీటిలో సంతోషంగా పార్టీ నాయకులతో కలిసి సెల్ఫీలు దిగారు. విస్తారంగా వర్షాలు కురవడం వల్ల వాగులు వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల సమీపంలో కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్ 11 గేట్లు ఎత్తారు. నీటిని వదలడం వల్ల బండర్‌పల్లి వాగు పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వాగులో సరదాగా గడిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
167 జాతీయ రహదారి పక్కనే వాగు ఉండటం వల్ల వివిధ వాహనదారులు వాహనాలను నిలిపి.. కాసేపు జలకళను తిలకించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి వేసిన సందర్భంగా వాగులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. వాగుపై చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల మరింత జలకళ సంతరించుకుంది.
ఇదీ చూడండి :భూ దందా: పేర్లు ఇరికించారు.. పత్రాలు చించేశారు!