గాంధీ, ఉస్మానియా తర్వాత మహబూబ్‌నగర్ వైద్య కళాశాలలోనే ఆర్‌టీపీసీఆర్ ల్యాబరేటరీని ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ ద్వారా ప్రతి జబ్బుకు పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు.
'హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే మెుదటి ల్యాబ్' - మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తాజా వార్తలు
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కరోనా పరీక్షల ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల కోసం హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇది మెుదటి కేంద్రమని ఆయన వెల్లడించారు. ఏనుగొండలో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు.
'హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే మెుదటి ల్యాబ్'
మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు గురుకుల, ఒక రెసిడెన్షియల్ పాఠశాల, ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆయన తెలిపారు. 15 రోజుల్లో టెండర్లను పిలుస్తామని మంత్రి వెల్లడించారు. ఏనుగొండలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి :ఓరుగల్లులో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి