కరోనా వ్యాప్తి నిరోధానికి గ్రామాల వారీగా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో కలెక్టర్, ఎస్పీ, డీఎమ్హెచ్వో సహా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్న మంత్రి.. పలు సూచనలు చేశారు.
గ్రామంలోకి వచ్చే వారి వివరాలు తెలుసుకోండి: మంత్రి - మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వార్తలు
ప్రతి గ్రామంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను హోర్డింగ్లా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. గ్రామాల వారీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2 వేల పడకలను సిద్ధం చేశామని స్పష్టం చేశారు.
గ్రామంలోకి వచ్చే వారి వివరాలు తెలుసుకోండి: మంత్రి
ప్రతి గ్రామంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపేలా హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం సూచనలు అందరూ పాటించాలని కోరారు. గ్రామంలోకి వచ్చే వారి వివరాలు తెలుసకోవాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2 వేల పడకలను సిద్ధం చేశామని తెలిపారు.
ఇదీ చూడండి:'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'