మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, పురపాలిక అధికారులతో పట్టణ ప్రగతి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు నిర్దిష్ఠ లక్ష్యాన్ని పెట్టుకుని అభివృద్ధిలో తమ పంథా చూపించాలని మంత్రి సూచించారు.
'రాష్ట్రంలోనే పాలమూరు అగ్రస్థానంలో ఉండాలి'
పాలమూరును రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా తీసుకునే విధంగా పట్టణీకరణ చేపట్టాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను సూచించారు. పట్టణ ప్రగతి పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
'రాష్ట్రంలోనే పాలమూరు అగ్రస్థానంలో ఉండాలి'
అభివృద్ధిని పెంపొందించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని... సంబంధింత శాఖలకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌ను అవినీతికి ఆస్కారం లేకుండా తీర్చిదిద్దాలని కోరారు. పాలమూరును రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. అంతకు ముందు మహబూబ్‌నగర్, హన్వాడ మండల పరిధిలోని గ్రామపంచాయతీలకు మంత్రి ట్రాక్టర్లను అందజేశారు. ట్రాక్టర్లను నడిపి అధికారులను ఉత్సాహపరిచారు.
ఇవీ చూడండి:భయాలు పటాపంచలు.. ఇద్దరు అనుమానితుల్లో వైరస్ లేదు