తెలంగాణ

telangana

ETV Bharat / state

రంజాన్​ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్ - మంత్రి శ్రీనివాస్​ గౌడ్

రంజాన్​ పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి సయ్యద్​ మర్ధన్​ అలీ షాఖాద్రి దర్గా మతాధిపతి సయ్యద్​ అబ్దుల్​ రజాక్​ షాఖాద్రిని కలిసి రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు.

Minister Srinivas Goud Ramzan Wishes
రంజాన్​ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్

By

Published : May 25, 2020, 11:35 PM IST

మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పర్యటించారు. రంజాన్​ సందర్భంగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని సయ్యద్​ మర్దన్​ అలీ షాఖాద్రి దర్గా మతాధిపతి సయ్యద్​ అబ్దుల్​ రజాక్​ షాఖాద్రిని కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం రోడ్లు భవనాల అతిథి గృహం ఆవరణలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలీంచి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్​ ఆవరణలో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల అన్నపూర్ణ భోజనం క్యాంటీన్​ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారందరికీ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మూసీ వరదల కారణంగా వందేళ్ల క్రితం రంజాన్​ను ముస్లింలు ఇళ్లలోనే పండుగ నిర్వహించుకున్నారని.. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇవీ చూడండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details