తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా...' - MINISTER SRINIVAS GOUD PROMISES TO TAKE THE RTC EMPLOYEES PROBLEMS TO CM ATTENTION

మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ కాన్వాయ్​ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు సర్దిచెప్పిన మంత్రి... సమస్యలను మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

MINISTER SRINIVAS GOUD PROMISES TO TAKE THE RTC EMPLOYEES PROBLEMS TO CM ATTENTION

By

Published : Oct 11, 2019, 6:14 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. మహబూబ్​నగర్​లోని ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి మంత్రి నివాసం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో మంత్రి కాన్వాయి రాగా... మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు. కారులోంచి దిగిన మంత్రి కార్మికులను కలిశారు. సమస్యలు పరిష్కరించాలంటూ వారు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ తండ్రి లాంటి వాడని... అందరినీ సొంత వాళ్లుగానే చూస్తారని కార్మికులకు మంత్రి సర్దిచెప్పారు. సమ్మె యోచన విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వం సూచించినా.. పండగ వేళలో సమ్మెకు వెళ్లడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానన్నారు. తనని ఎవరూ అడ్డుకోలేదని... ఆర్టీసీ కార్మికులు ఎక్కడుంటే అక్కడ ఆగుతానని తాను ముందే చెప్పినట్లు మంత్రి తెలిపారు.

'ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా...'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details