పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం - మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు అన్ని మున్సిపాలిటీల్లో తెరాసకు పట్టం కడతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం
మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. అప్పనపల్లి, ఏనుగొండలోని తదితర ప్రాంతాల్లో ఇంటింట తిరుగతూ తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరులో తాము చేసిన అభివృద్ధికి కళ్లకు కనిపిస్తోందని వెల్లడించారు. మున్సిపాలీటీల్లో తెరాసను గెలిపించాలని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.