డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బస్టాండ్‌లో జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి నిరంతరం పోరాడిన గొప్పవ్యక్తి అంబేడ్కర్ అని మంత్రి పేర్కొన్నారు.
'వచ్చే ఏడాదికల్లా పాలమూరు మొత్తం సాగునీరు అందిస్తాం' - మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్తలు
నిరంతరం పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వచ్చే ఏడాది అంబేడ్కర్ జయంతి నాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేసుకుని... జిల్లా మొత్తం సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ రావడానికి కూడా ఆయనే ప్రధాన కారణమని అన్నారు. రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని ఆర్టికల్ 3లో రాశారని వెల్లడించారు. విదేశాల్లో చదువుకునే వారికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా... పేద, బడుగు, బలహీన వర్గాల కోసం దాదాపు 1000 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు తీసుకొస్తామని వెల్లడించారు. రిజర్వేషన్ల ద్వారా చదువుకొని, ఉద్యోగాలు చేస్తూ, రాజకీయ పదవులు చేస్తున్న ప్రతి ఒక్కరూ సమాజం కోసం పనిచేయాలని కోరారు. వచ్చే ఏడాది అంబేడ్కర్ జయంతి నాటికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేసి.. జిల్లా మొత్తం సాగు నీరు అందిస్తామని మంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి:బాబాసాహెబ్‌కు మోదీ, రాహుల్ నివాళి